AP: తూ.గో జిల్లాలో అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని APCC చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇప్పటికి పది మంది మృతి చెందారని తెలిపారు. అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదని మండిపడ్డారు. దయచేసి నిరహార దీక్షను విరమించుకోవాలని కాంగ్రెస్ నేతలను అభ్యర్థించారు.