NZB: పోలీస్ స్మారక దినం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ను వివిధ పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. ఫిర్యాదులను ఎలా నమోదు చేస్తారు, షీ టీం పనిచేసే విధానం, ట్రాఫిక్ భద్రత నియమాల అమలు తదితర వాటిపై సీఐ రవికుమార్ అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర సమయాల్లో డయల్ 100 ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలిపారు.