AP: సరస్వతి పవర్ సంస్థ భూముల వ్యవహారంపై DY. CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలింది. ‘పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీశాఖ భూములు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో పేర్కొంటూ నివేదిక ఇవ్వాలి’ అని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాచేపల్లి DRO ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది దాచేపల్లి, మాచవరం మండలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు.