AP: విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత పర్యాటక శాఖ ఈ విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. దేవీపట్నం మండలం పోసమ్మగండి నుంచి పర్యటక బోట్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అక్కడ పర్యాటకుల సందడి నెలకొంది.