AP: మాజీ సీఎం జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన శక్తికి మించి సాయం చేశానని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రచారం చేశానని, CM కాగానే గుర్తుపట్టలేనంత మారిపోయాడన్నారు. తనను చిన్నచూపు చూడటమే కాకుండా విడిపోదామని ప్రతిపాదన పెట్టారని, ఇందుకు అమ్మ, తాను అంగీకరించలేదన్నారు. ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారని, ఎక్కువ వాటా కావాలని జగన్ పట్టుబట్టినట్లు పేర్కొన్నారు.