రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. NTPC అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27వ తేదీగా కేటాయించారు. అంటే.. ఎల్లుండే ఈ ప్రక్రియ ముగుస్తుంది.