నైపుణ్యం కలిగిన భారత శ్రామికుల కోసం జర్మనీ వీసాల సంఖ్యను పెంచినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 20 వేల నుంచి 90 వేలకు వీసాలు పెంచినట్లు చెప్పారు. ‘ఫోకస్ ఆన్ ఇండియా పేరిట జర్మనీ కేబినెట్ ఒక పత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. వీసాల సంఖ్య పెంచటం ఆ దేశ వృద్ధికి దోహదం చేస్తుంది. భారత్ తయారీ కేంద్రంగా మారింది. రాబోయే 25ఏళ్లకు వికసిత్ భారత్ కోసం రోడ్‌మ్యాప్ రూపొందించాం’ అని పేర్కొన్నారు.