AP: విజయవాడలో వరద బాధితుల్లో మరికొంత మందికి ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఇవాళ 1,501 మందికి రూ.2.5 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో బ్యాంకు ఖాతా ఇనాక్టివ్గా ఉండటంతో 143 మందికి పరిహారం జమ కాలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని అందించనున్నారు. బ్యాంకు ఖాతాలు అందుబాటులో లేని 256 మంది అర్హుల వివరాలను సచివాలయం, ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం వెల్లడించనున్నట్లు సమాచారం.