కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోపై అక్కడ హైకమిషనర్‌గా వ్యవహరించిన సీనియర్ దౌత్యవేత్త సంజయ్ వర్మ తీవ్రంగా మండిపడ్డారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వెల్లడించారు. కెనడా వెళ్లాలన్న ఆలోచనున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తాను దౌత్యవేత్తగా ఉన్న సమయంలో ఒక దశలో కనీసం వారానికి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.