TG: HYD కూకట్పల్లి PS దగ్గర AIMMS విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చదివిన కోర్సులకు ధ్రువపత్రాలు, ఫీజులు కట్టిన డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరారు. తప్పుడు పత్రాలతో కళాశాల పెట్టి జీవితంతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేషనల్ కోర్సులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేసిందని ఆరోపించారు. దీంతో పోలీసులు AIMMS కళాశాలల బ్రాంచ్‌లపై కేసు నమోదు చేశారు.