అనకాపల్లి: మాడుగులలో శివాలయాలు కార్తీక మాసానికి ముస్తాబవుతున్నాయి. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతి భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి రంగులు వేస్తున్నారు. కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఉంటుందని ఆలయ పూజారి జరుగుబిల్లి సుబ్బారావు తెలిపారు.