జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లాలో సైనిక వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. గుల్మార్గ్లోని బోట్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 18 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.