వయసు నిర్ధారణపై పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. వయసును నిర్ధారించేందుకు ఆధార్ ప్రమాణికం కాదని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం చెల్లించే వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఆధార్ కార్డుపై ఉన్న వయస్సును హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పాఠశాల రికార్డులో ఉన్న తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.