ASR: అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయతీ జాలాడ గ్రామంలో గురువారం ఎస్సై డీ.శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.