HYD: కార్వాన్ నియోజకవర్గం జియాగూడలో మూసి పరివాహక ప్రాంతంలో బీజేఎల్పీ బృందం పర్యటించింది. మూసీ బెల్ట్ పక్కన ఉన్న బస్తీల్లో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ తదితరులు పర్యటిస్తూ బాధితుల వ్యధ వింటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మూసీ బాధితులు ఉన్నారు.