TG: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా.. కె.కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్ డీఏలపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటించనున్నట్లు ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.