JGL: రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ(HDS) సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం 317 జీవో ద్వారా తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని నర్సింగ్ సిబ్బంది అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.