VZM: జిల్లాలో ఇక పై డయేరియాతో ఏ ఒక్కరు మరణించకూడదని, అటువంటి మరణాలు జరిగితే సంబంధిత అధికారుల పై చర్యలు తప్పవని రాష్ట్ర హోం, జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం అనగానే డయేరియా, సీజనల్ వ్యాధులు సాధారణంగా వస్తాయని ముందస్తు చర్యలతో వాటిని నివారించాలన్నారు.