TG: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వలె ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మూసీ నిర్వాసితుల బాధలు చూసే హైదరాబాద్కు వచ్చామని తెలిపారు. అసలు సీఎంకు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్న రేవంత్.. డీపీఆర్ కోసం నిధులు ఎలా తెస్తారని అడిగారు. వెంటనే శాసనసభ సమావేశం నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.