W.G: రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం తమ వంతు సాయంగా భీమవరం వెస్ట్ బెర్రీ పాఠశాల విద్యార్థులు రూ.లక్ష విరాళాన్ని గురువారం అందజేశారు. భీమవరం కలెక్టర్ ఛాంబర్ కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసిన విద్యార్థులు ఈ మేరకు చెక్కును అందజేశారు. స్కూలు డైరెక్టర్ ఎన్.మహేశ్‌కుమార్, ప్రిన్సిపల్ ఎస్.స్మిత, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.