SKLM: రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ రాగోలు పంచాయతీలో రెవెన్యూ సదస్సులో గురువారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో రీ- సర్వే జరిగిన గ్రామాల్లో తప్పుగా నమోదైన వాటిని సరిచేయడానికే ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు.