KRNL: బేతంచెర్ల మండలంలోని గోర్లగుట్ట గ్రామంలో రీసర్వేలో జరిగిన పొరపాట్లు సరిచేయుట కోరకు గ్రామ సభ తహశీల్దార్ ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామస్తుల నుండి మొత్తం 45 అర్జీలు రాగా అందులో జాయింట్ పట్టా 11, నేమ్ కరెక్షన్ 14, ఎక్స్ టెంట్ తేడా 19, ముటేషన్ కరెక్షన్ 1 భూ సమస్యలు వచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు.