దానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ తుఫాన్ ఒడిశా, బెంగాల్‌లపై తీవ్ర ప్రభావం చూపనుంది. తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇవాళ విశాఖ నుంచి భువనేశ్వర్ వైపు వెళ్లే 42 ట్రైన్స్ రద్దు చేయగా.. రేపు 24 ట్రైన్స్ రద్దు చేశారు. దీని ప్రభావంతో ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.