వయనాడ్‌లో నెహ్రూ కుటుంబాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ అన్నారు. వయనాడ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఐదేళ్లు ఇక్కడే ఉంటానని చెప్పిన రాహుల్ గాంధీ మాట తప్పారన్నారు. రాయ్‌బరేలీ కోసం ఇక్కడి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, నవంబర్ 13న అక్కడ పోలింగ్ జరగనుంది.