BPT: మెదరమెట్ల వద్ద జరిగిన దారిదోపిడి కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి రూ.39.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.