SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ ZPHS కు చెందిన ఐదుగురు విద్యార్థులు రెండు విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నర్సాపూర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి అండర్-18 ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సంయుక్త, పూజ, వసంత, హర్షిత ఈనెల 28 నుంచి 30 వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే 43వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో పాల్గొంటారని హెచ్ఎం సుధాకర్ తెలిపారు.