TG: బొగ్గు లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకోసం బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో దేశంలో ఎదురయ్యే పవర్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల సంక్షేమం, గనులకోసం భూములు వదిలి వెళ్తున్న వారందరి సంక్షేమం గురించి ఆలోచించాలని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు.