జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామ శివారులోని వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు ఆపాలని గ్రామగీత కార్మిక సంఘం సభ్యులు తహసీల్దార్ వినోద్‌కు వినతి పత్రం ఇచ్చారు. అక్రమంగా వాగులో ఇసుకను తవ్వడంతో ఈత చెట్లకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. . ఇసుక తరలిపోకుండా రెవెన్యూ శాఖ తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.