VZM: గుర్ల గ్రామంలో కలుషిత జలాల కారణంగా డయేరియా ప్రబలి పలువురి మృతికి కారణమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు జిల్లా కేంద్రంలో అధికారులతో సమావేశమై ఈ ఘటనకు కారణాలను తెలుసుకుంటారు. అనంతరం గుర్ల బయలుదేరి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడుతారు.