YS Sharmila on errabelli dayakar rao:పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో (palakurthi) ప్రజా ప్రస్థాన యాత్ర బహిరంగ సభ వేదిక వద్ద మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు (double bedroom home) ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు.
YS Sharmila on errabelli dayakar rao:పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో (palakurthi) ప్రజా ప్రస్థాన యాత్ర బహిరంగ సభ వేదిక వద్ద మాట్లాడారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వల్ల నియోజక వర్గంలో ఒక్క మేలు జరిగిందా అని అడిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు (double bedroom home) ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. నియోజక వర్గంలో మంత్రి గుట్టలు మొత్తం రాసి ఇస్తున్నారట అని ప్రశ్నించారు. కోలుకొండ గుట్టల అక్రమాల వెనుక మంత్రి హస్తం లేదా? అని అడిగారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాం అనే సోయి లేదని మండిపడ్డారు.
బ్రాందీ బాటిల్ అమ్ముకోవాలా?
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయి ఉండి నిధులు (funds) లేవు అంటారు. పంచాయతీలు (panchayat) నడపడానికి ఖాళీగా ఉన్న బ్రాందీ (brandi) బాటిళ్లు అమ్ముకోమని చెప్పారట.. ఇదెక్కడి విడ్డూరం అని అడిగారు. నిధులు లేక సర్పంచ్లు (sarpanch) ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ (cm kcr) మాదిరిగా మంత్రులు తయారయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన నడుస్తుందని చెప్పారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నాలుగున్నర లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు. ఇంత అప్పు చేసినా ఏం లాభం లేదన్నారు. కీలక అంశాలకు నిధులు కేటాయించలేదన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు.. ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నారని పేర్కొన్నారు.
రైతుబంధుతో కోటీశ్వరులు అవుతారా?
అప్పుల పాలు అయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల (YS Sharmila) గుర్తుచేశారు. 5 వేలు రైతు బంధు (rythu bandu) ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా..? అని అడిగారు. గుడులు (temple), బడులు (school) కన్నా రాష్ట్రంలో బెల్ట్ షాపులు (belt shop) ఎక్కువ అని షర్మిల విమర్శలు చేశారు. మద్యం అమ్మకాలతో రాష్ట్రం నడిపే పరిస్థితి ఏర్పడిందన్నారు. లేదంటే భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ (kcr) BRS అకౌంట్ లో 860 కోట్లు ఉన్నాయట అని చెప్పారు. కమీషన్ల కింగ్ కేసీఆర్ అని.. బిడ్డ కవిత లిక్కర్ స్కాం. కొడుకు కేటీఆర్ రియర్ ఎస్టేట్ దందా అని షర్మిల (YS Sharmila) విరుచుకుపడ్డారు. రాష్ట్రం మొత్తం దోచుకు తిన్నారని మండిపడ్డారు.
మళ్లీ వస్తాడు.. జర జాగ్రత్త
ఎన్నికలు వస్తున్నందున మళ్ళీ వచ్చి మంచి మాటలు చెబుతాడని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సారి గిరిజన బంధు (girijana bandu).. బీసీ బంధు (bc bandu) అంటాడని చెప్పారు. మళ్లీ నమ్మి మోసపోవద్దని కోరారు. కేసీఆర్ (cm kcr) ఆగడాలకు ప్రతిపక్షాలు కారణం అని షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ కేసీఆర్కు అమ్ముడు పోయాయని ఆరోపించారు. ఇక్కడ మాట మీద నిలబడే నాయకుడు లేడన్నారు. అందుకే తాను పార్టీ ఏర్పాటు చేశానని తెలిపారు. 3700 km పాదయాత్ర చేశానని.. రాత్రనగా పగలనకా.. యాత్ర చేపట్టి జనం ఇబ్బందులను తెలుసుకున్నానని వివరించారు.