ALR: వర్షాలు, పిడుగులు గిరిజన రైతుల పాలిట శాపంగా మారాయి. కొయ్యూరు మండలంలో ఆదివారం పిడుగులు పడి 15 పశువులు మృతి చెందిన ఘటన మరువక ముందే గూడెం కొత్తవీధి మండలంలో ఒకే రైతుకు చెందిన 8 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఎల్లవరం గ్రామానికి చెందిన గెమ్మెలి పండన్న అనే రైతు తన పశువులను మేతకు తోలుకొని వెళ్లాడు. ఈ క్రమంలో పిడుగులు పడి 6 ఆవులు, రెండు మేకలు మృతి చెందాయి.