టీమిండియాపై తమ విజయానికి టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపారు. ‘ఒకవేళ టాస్ గెలిస్తే మేము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లం. తొలి ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో భారత్‌ను 46 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్యాటింగ్‌లో రవీంద్ర, సౌథీ భాగస్వామ్యం మా విజయానికి బాటలు వేసింది. రెండో టెస్ట్‌లో కూడా ఇలాంటి ప్రదర్శన చేసి సిరీస్ సొంతం చేసుకుంటాం’ అని అన్నారు.