సత్యసాయి: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆదివారం భక్తులచే పూజలు అందుకుంది. ఉదయాన్నే అర్చకులు మారెమ్మ మూల విగ్రహానికి అభిషేకాలు చేసి కుంకుమ, విభూది, కాటుక, పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి, పూజలు చేశారు. తర్వాత మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయావరణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించారు.