ప్రకాశం: మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చెవులో పువ్వు పెట్టుకొని నిరసన తెలిపారు. అక్రమంగా తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ.. కార్మికుల పట్ల అధికారులు మొండి వైఖరి విడనాడాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు.