జనగాం: ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండలం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముదిరాజులతో కలిసి చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.