SKLM: దేశానికి గొప్ప సేవలు చేసిన రతన్ టాటా, కమ్యూనిస్టు నాయకుడు సీతారాం, పౌర హక్కుల నేత సాయిబాబా మృతికి లావేరు మండలం అదపాక పాఠశాలలో నివాళులు అర్పించారు. శనివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యాయులు గిరిధర్ మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తులను కోల్పోవడం సమాజానికి తీరని నష్టమని తెలిపారు. విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.