SRCL: గంభీరావుపేట సింగసముద్రం వద్ద రైతులు భారీ కొండచిలువను పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ సరిహద్దులోని స్థానిక రైతులు పంట పొలం వద్దకు వెళ్తుండగా కొండచిలువ తారాసు పడింది. గమనించిన రైతులు వెంటనే కొండ చిలువను పట్టుకుని హతమార్చి ఊపిరి పీల్చుకున్నారు. సుమారు దీని పొడవు మూడు గజాలు ఉంటుందని రైతులు పేర్కొన్నారు.