VZM: తెర్లాం మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంజూరైన సీఎం సహాయనిది చెక్కును బాధితుడికి గురువారం అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.43,690 నగదును ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మందికి లబ్ధి కలుగుతుందన్నారు.