AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తేదీనే జీతాలు, పింఛన్లు ఇస్తుందని, జగన్ జమానాలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ పాలనలో SC, ST, BCలకు 100కు పైగా సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారని విమర్శించారు. 100 రోజుల్లోనే 100కు పైగా సంక్షేమ పథకాలిచ్చిన సమర్థత CM చంద్రబాబుదని కొనియాడారు. 1వ తేదీన ఇంటికే పింఛన్లు అందించడం జగన్కు కనిపించట్లేదా అని ఎద్దేవా చేశారు.