విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో S1 ఎక్స్ స్కూటర్‌ను రూ.49,999కే అందిస్తామని కంపెనీ ప్రకటించింది. కాగా, లిమిటెడ్ యూనిట్లకు మాత్రమేనని తెలిపింది. అలాగే, హైపర్ ఛార్జింగ్ క్రెడిట్స్, మూవ్ఓస్+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్‌పై డీల్స్ వంటి రూ.40 వేల ప్రయోజనాలనూ ఫెస్టివ్ ఆఫర్ కింద అందిస్తోంది.