TG: రైతులకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావడం లేదు. వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లింది. కేంద్రం రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య స్నేహబంధం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.