KMR: జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కరీంనగర్ నుంచి కామారెడ్డికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన రాజేశ్వర్ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని టీఎన్జీవోస్ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, కేంద్రసంఘం కార్యదర్శి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.