జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ అమ్మాయే ఫ్యామిలీని వదిలేసిరా అని బ్లాక్ మెయిల్ చేసేది.. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ ఆమె పేరెంట్స్ జానీపై ఒత్తిడి చేశారు. ఈ కేసులో ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఆమె ఏ ప్రోగ్రాం చేసినా.. వాళ్ల అమ్మ పక్కనే ఉంటుంది. లైంగిక వేధింపులు చేస్తుంటే వాళ్ల అమ్మ ఏం చేస్తుంది..? నేను ఆమెను కొట్టినట్లు నిరూపించాలి. ప్లాన్ ప్రకారమే ఆ అమ్మాయి కుట్ర చేసింది’. అని చెప్పారు.