దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు, పప్పులు, నూనెలు, బియ్యం, పాలు ఇలా అన్నింటి ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిన అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం లీటర్ వంట నూనె ప్యాకెట్‌పై రూ.20 నుంచి రూ.45, కేజీ కందిపప్పు రూ.150 నుంచి రూ.175, అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, బియ్యం క్వింటాల్ రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగాయి. అటు కూరగాయలు కూడా అంతే ఉన్నాయి. దీంతో ప్రజలు పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు.