AP: తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. లడ్డూ వివాదం అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు దేవుడిని తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో అలజడి రేపడం ఇష్టం లేకే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని ఆమె తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక జగన్ తిరుమలకు రాలేదన్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు.