హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థికసాయం, రైతులకు ఎంఎస్పీ హామీ, కుల గణన తదితర హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. కాగా, అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.