NRML: లక్ష్మణ్ బాపూజీ మహనీయుడని,మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని,ఆస్తులను దానం చేశారని మండల అధికారులు కొనియాడారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడు బాపూజీ బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అని కొనియాడారు.