Ind vs Aus: చెలరేగిన జడేజా, అశ్విన్..177 పరుగులకే ఆసీస్ ఆలౌట్
నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా(Ind vs Aus) తలపడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సత్తా చాటాడు. అశ్విన్(Ashwin) కూడా 450వ వికెట్ పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా(Ind vs Aus) తలపడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సత్తా చాటాడు. అశ్విన్(Ashwin) కూడా 450వ వికెట్ పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గత ఏడాది గాయానికి గురై జట్టుకు కొన్నినెలల పాటు జడేజా(Ravindra Jadeja) దూరమయ్యాడు. ఎట్టకేలకు మళ్లీ ఇప్పుడు తాను ఫామ్‌లోకి వచ్చాడు. తొలి టెస్టులో జడేజా(Ravindra Jadeja) తన లెఫ్ట్ ఫార్మ్ స్పిన్‌తో ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా(Ravindra Jadeja) ఈ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను పడగొట్టాడు. మరోవైపు స్టార్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్(Ashwin) 3 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) టెస్ట్ సిరీస్‌కు నాగపూర్‌లో పిచ్ స్పిన్ సహకరిస్తుందో లేదోననే అనుమానం ఉండేది. అంతేకాకుండా పేసర్లకు అనుకూలిస్తుందో లేదోననే సందిగ్ధత ఉండేది. ఈ సందేహాల నడుమ ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆ జట్టు 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. భారత పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా దిగ్భ్రాంతికి గురైంది. తొలి వికెట్‌ను సిరాజ్ తీశాడు. అలాగే రెండో వికెట్‌ను షమీ తీశాడు. ఆస్ట్రేలియాలో ఎంతో అనుభవం ఉన్న ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లు సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టారు. దీంతో అది పేస్ పిచ్ అనే వ్యాఖ్యలు వినిపించాయి.
రెండు వికెట్లు పడిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు మార్నస్ లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37) నిలకడగా ఆడుతూ వచ్చారు. దీంతో పిచ్‌పై పేస్ ఏమంతగా లేదని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత స్పిన్నర్లు రంగ ప్రవేశం చేశారు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ వైపు జడేజా(Ravindra Jadeja), మరో వైపు అశ్విన్(Ashwin) ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు తీస్తూ వచ్చారు. దీంతో భారత్ తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది.
Innings Break!
Brilliant effort from #TeamIndia bowlers as Australia are all out for 177 in the first innings.
An excellent comeback by @imjadeja as he picks up a fifer 👏👏
ఆస్ట్రేలియా, భారత్(Ind vs Aus) తొలి టెస్ట్ మ్యాచ్‌లో పిచ్ నుంచి సహకారం అందుకున్న జడేజా(Ravindra Jadeja) ఆస్ట్రేలియా మిడలార్డర్ను దెబ్బకొట్టాడు. ఫామ్‌లో ఉన్నటువంటి లబుషేన్, స్మిత్‌ల వికెట్లు తీశాడు. అంతేకాకుండా వారితో పాటుగా మాట్ రెన్ షా (0), పీటర్ హాండ్స్ కోంబ్ (31), టాడ్ మర్ఫీ (0)లను అవుట్ చేసి కంగారూలను దెబ్బతీశాడు.
ఆ తర్వాత మరో ఎండ్ లో రవిచంద్రన్ అశ్విన్(Ashwin) కూడా ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (36)ను అవుట్ చేశాడు. అశ్విన్(Ashwin) విసిరిన బంతిని ఆడబోయి కేరీ బౌల్డ్ అవ్వడంతో పెవిలియన్ దారి పట్టాడు. అలాగే ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (6) వికెట్ కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆసీస్ టెయిలెండర్ స్కాట్ బోలాండ్ ను బౌల్డ్ చేసి తొలి ఇన్నింగ్స్ ను అశ్విన్(Ashwin) ముగించాడు.