జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జతగా తెరకెక్కిన దేవర సినిమా ఇవాళ విడుదలైంది. దీంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శించగా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ స్టోరీ భారీ ట్విస్ట్‌తో ముగియగా సెకండ్ ఆఫ్‌లో అనుకున్న రేంజ్లో లేకున్నా ప్రీ క్లైమాక్స్ సీన్ అదరగొట్టిందంటున్నారు. మొత్తానికి ఈ సినిమాకు 3.35 రేటింగ్ ఇచ్చేయోచ్చని నెటిజన్లు చెబుతున్నారు.