SKLM: అక్టోబర్ 1 నుంచి 3 వరకూ కోటబొమ్మాళిలో జరగనున్న రాష్ట్రస్థాయి కొత్తమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించేలా గ్రామపెద్దలు, అధికారులు కృషి చేయా లని వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు.నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించి జాతరపై పలు సూచనలు చేశారు. తాగునీరు, ఉచిత ప్రసాదం, క్యూలు, భక్తులకు బస్సు సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు.